Aug 09,2023 21:33
  • 350% డివిడెండ్‌కు ఆమోదం

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా 2023-24 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 31.2 శాతం వృద్థితో రూ.420.3 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.320.4 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.884.6 కోట్లుగా ఉన్న కంపెనీ రెవెన్యూ.. క్రితం క్యూ1లో రూ.1,140.5 కోట్లకు పెరిగింది. కంపెనీ వ్యయం రూ.533.1 కోట్ల నుంచి రూ.660.2 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం 2023-24గాను మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.7 లేదా 350 శాతం మధ్యంతర డివిడెండ్‌ అందించడానికి నాట్కో ఫార్మా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బుధవారం బిఎస్‌ఇలో నాట్కో ఫార్మా షేర్‌ 1.86 శాతం పెరిగి రూ.894.10 వద్ద ముగిసింది.

బిఎస్‌ఇ లాభాల్లో 71% వృద్థి

ముంబయి : లీడింగ్‌ స్టాక్‌ ఎక్సేంజీ బిఎస్‌ఇ 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 71 శాతం వృద్థితో రూ.75.1 కోట్ల లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.44 కోట్ల లాభాలు ప్రకటించింది. గడిచిన త్రైమాసికంలో బిఎస్‌ఇ రెవెన్యూ 37 శాతం పెరిగి రూ.271.2 కోట్లుగా నమోదయ్యింది. రోజు సగటు టర్నోవర్‌ రూ.4,025 కోట్లుగా చోటు చేసుకుందని ఆ సంస్థ తెలిపింది.