May 31,2023 20:58

ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌ మాసంలో ఎనిమిది ప్రధాన మౌలిక వసతుల రంగాల ఉత్పత్తి 3.5 శాతానికి పడిపోయి ఆరు మాసాల కనిష్టానికి జారింది. ముఖ్యంగా ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్స్‌, విద్యుత్‌ రంగాల ఉత్పత్తిలో తగ్గుదల చోటు చేసుకుంది. ఇంతక్రితం 2022 అక్టోబర్‌లో కీలక రంగాల ఉత్పత్తి అత్యల్పంగా 0.7 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. వాణిజ్య, పరిశ్రమల శాఖ గణంకాల ప్రకారం.. గడిచిన ఏప్రిల్‌లో ఎరువుల ఉత్పత్తి 23.5 శాతం, స్టీల్‌ 12.1 శాతం, సిమెంట్‌ 11.6 శాతం చొప్పున పెరిగింది. మరోవైపు చమురు ఉత్పత్తి 3.5 శాతం పడిపోయింది.