Aug 28,2023 21:42
  • కలర్‌ బ్యాంక్స్‌ టెక్నాలజీలోకి టెక్నో పెయింట్స్‌
  • ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌ : పెయింట్స్‌ తయారీ, విక్రయంలో ఉన్న టెక్నో పెయింట్స్‌ తాజాగా కలర్‌ బ్యాంక్స్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. భారత్‌లో ఐదారు కంపెనీలు మాత్రమే ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. దిగ్గజాల సరసన చేరడంతో కంపెనీ ప్రయాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని టెక్నో పెయింట్స్‌ను ప్రమోటు చేస్తోన్న ఫార్చున్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కలర్‌ బ్యాంక్స్‌తో 3,000 పైచిలుకు రంగులను నిముషాల్లో కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందన్నారు. స్మార్ట్‌ఫోన్‌తో సైతం కలర్‌ బ్యాంక్స్‌ను ఆపరేట్‌ చేయగలిగేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. తొలుత 1,000 మంది డీలర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా సిటీ నటుడు మహేశ్‌ బాబు చేరికతో మారుమూల పల్లెలకూ కంపెనీ పాకిందన్నారు. కంపెనీ ఉత్పత్తులకు డీలర్ల నుంచి మంచి స్పందన ఉందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో తమకు 1,000 మంది డీలర్లు ఉన్నాన్నారు. 2024 మార్చికల్లా డీలర్‌ నెట్‌వర్క్‌ 3,000లకు చేరుతుందని శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. కంపెనీ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను నిర్మిస్తోందన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ సమీపంలోని పాశమైలారం, చేర్యాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నడికుడి వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్టోబరుకల్లా కొత్త కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు