ప్రజాశక్తి- ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : వెలుగు విఓఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిబిఓ హెచ్‌ఆర్ పాలసిని అమలు చేయాలనీ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం విఓఏ సమావేశం ఎచ్చెర్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెలుగులో పనిచేస్తున్నా విఓఎలు అనేక ఏళ్ళగా పని చేస్తున్నా, కనీసవేతనాలు, ఉద్యోగ భద్రత లేదన్నారు. అలాగే కాలపరిమితి సర్కిలెర్‌ను తీసుకోచ్చి, తొలగింపులకు పాల్పడుతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. తెలంగాణ మాదిరి సిబిఓ హెచ్‌ఆర్ పాలసిని అమలు చేయాలన్నారు. విఓఎల నాయమైన డిమాండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమలో విఓఎల మండల నాయుకులు జి అరుణ, కె.సరిత, బి.కనకమహాలక్ష్మి, ఏ.సుజాత, జె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










