ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంలో విలీనమయ్యాక ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యలన్నీ తీరుతాయనుకుంటే మరిన్ని సమస్యలు ముందుకొచ్చాయని, ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎపి జెఎసి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలోని బస్టాండ్‌లో ఎపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బొప్పరాజుతోపాటు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు మాట్లాడారు. వైద్య సేవలను తగ్గించడం, అలవెన్స్‌లు, టిఎ, డిఎలను తగ్గించడం వంటి చర్యలతో ఆర్‌టిసి ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. చివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లాస్ ప్లోర్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.










