Sep 13,2022 21:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ ఆర్‌టిసి ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం లిమిటెట్‌ (సిసిఎస్‌) సభ్యుల పిల్లల్లో పది, ఇంటర్‌, డిగ్రీలలో ఎక్కువ మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులను ఆర్‌టిసి అందించనుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో 90 శాతం మార్కులు, ఇతర కోర్సుల్లో 60 శాతానికి మించి మార్కులు వచ్చిన విద్యార్థులు ఈ నెల 30లోపు సిసిఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని సిసిఎస్‌ కార్యదర్శి టి త్రాసు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ప్రతి తరగతికీ 10 మంది ఎక్కువ మార్కులను తెచ్చుకున్న వారికి ఈ ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సిసిఎస్‌ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.