
- పవన్ షెహ్రావత్, ఫజల్, షడ్లోరుపైనే దృష్టి
ముంబయి: ప్రొ కబడ్డీ సీజన్-10కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలం ప్రారంభమైంది. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెషన్ సెంటర్‌లో సోమవారం జరిగిన తొలిరోజు వేలంలో 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. అన్ని ఫ్రాంచైజీలు ఇరాన్ ఆటగాళ్లు పవన్ షెహ్రావత్(ఆల్‌రౌండర్), ఫజల్ అత్రాఛలి(డిఫెండర్), షడోరు(ఆల్‌రౌండర్)లను దక్కించుకొనేందుకు పోటీపడ్డాయి. ఏ కేటగిరీ బరిలో వీరంతా ఉన్నారు. అలాగే ఏ కేటగిరీలో హర్యానాకు చెంందిన రోహిత్ గులియా, విజరు మాలిక్‌తోపాటు, మణిందర్ సింగ్(పంజాబ్), మంజిత్ ఛిల్లర్(ఢిల్లీ)ను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అలాగే బి, సి కేటగిరీల్లోనూ ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు.
ఫ్రాంచైజీల వివరాలు..
1. బెంగాల్ వారియర్స్ 4,22,69,552 8
2. బెంగళూరు బుల్స్ 2,99,38,470 9
3. దబాంగ్ ఢిల్లీ(కె.సి.) 3,12,69,552 6
4. గుజరాత్ జెయింట్స్ 4,02,67,075 6
5. హర్యానా స్టీలర్స్ 3,13,34,552 12
6. పింక్ ప్యాంథర్స్ 87,95,805 12
7. పట్నా పైరెట్స్ 3,09,60,545 10
8. పుణేరి పల్టన్స్ 2,80,71,538 13
9. తమిళ్ తలైవాస్ 2,43,64,164 14
10. తెలుగుటైటాన్స్ 3,44,62,733 9
11. యు ముంబా 2,69,98,360 13
12. యుపి యోథా 2,06,42,802 10