Apr 04,2023 21:00

న్యూఢిల్లీ : తాము ఆవిష్కరించిన ప్రైమ్‌బుక్‌ 4జికి అనుహ్యా స్పందన లభిస్తుందని ఆండ్రాయిడ్‌ ఒఎస్‌ ఆధారిత ల్యాప్‌టాప్‌ తయారీ బ్రాండ్‌ ప్రైమ్‌ బుక్‌ పేర్కొంది. రూ.20వేల దిగువన విలువ చేసే తమ ల్యాప్‌ ట్యాప్‌లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ప్రైమ్‌ ఒఎస్‌పై నడిచే ప్రైమ్‌బుక్‌ 4జి ధరను రూ.16,990గా నిర్ణయించగా.. ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు రూ.14,990కే అందిస్తున్నట్లు పేర్కొంది.