Apr 13,2023 15:05

యాదగిరిగుట్ట, భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామికి యాత్రికుల తాకిడి నానాటికి పెరుగుతుంది. దీంతో బాటు స్వామివారికి విరాళాలు, కానుకల బహుకరణకు యాత్రికులు తమ శక్తి కొలది సమర్పించుకుంటున్నారు. హైదరాబాద్‌ లోని చంపాపేట్‌ కు చెందిన మాచమోని ప్రకాశ్‌ ముదిరాజ్‌ అనే యాత్రికుడు సుమారు రూ. 30 లక్షల విలువచేసే అర కేజీ బంగారం , అరకేజీ వెండితో మూడు కిరీటాలు, ప్లేట్లు స్వామి వారికి బహూకరించారు. ఇందుకు సంబంధించిన కిరీటాలను ఆలయ ఈవో గీతకు అందజేశారు. ఈ సందర్భంగా మాచమోని ప్రకాశ్‌ కుటుంబ సభ్యులను అర్చకులు ఆశీర్వదించారు.