Jun 14,2023 13:29

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : చిలకలూరిపేట 36వ వార్డులో ఇటీవల మఅతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ప్రత్తిపాటి ఫౌండేషన్‌ అండగా నిలిచింది. మూడ్రోజుల క్రితం గుండెపోటుతో సీనియర్‌ జర్నలిస్టు వెంకటేశ్వర్లు మరణించారు. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పాత్రికేయులు వెంకటేశ్వర్లు కుటుంబానికి ప్రత్తిపాటి ఫౌండేషన్‌ తరఫున రూ.20 వేల ఆర్థిక సాయాన్ని బుధవారంనాడు అందించారు. వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులకు టిడిపి నాయకులు నగదు సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎస్‌ గుంటూరు జిల్లా అధ్యక్షులు దండా గోపి, 36 వ వార్డు కౌన్సిలర్‌ రాయని హరిత, రాయని శ్రీనివాస్‌ (ల్యాబ్‌ శ్రీను), టిడిపి సీనియర్‌ నాయకులు ఈదర వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి పోకూరి లక్ష్మి, యూనిట్‌ ఇన్‌ఛార్జి అల్ల హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.