
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత్య సన్నిహితుడైన గౌతమ్ అదాని సంస్థల అక్రమాలపై పరిశోధనాత్మక కథనాలు అందించిన పాత్రికేయుడు ఆనంద్ మంగ్నాలే ఫోన్‌లో పెగాసస్ స్పైవేర్ అమర్చివుండవచ్చని ఫోరెన్సిక్ నిపుణుడిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మంగ్నాలే ఫోన్‌లో అనుమానాస్పద వైఫల్యాలు కన్పించాయని, అవి గతంలో పెగాసస్ చొరబాట్లను పోలి ఉన్నాయని ఫోరెన్సిక్ సంస్థ 'ఐ వెరిఫై' రాయిటర్స్‌కు వివరించింది. 'నేను అత్యంత నమ్మకంతో చెప్పగలను. మంగ్నాలే ఫోన్‌పై పెగాసస్ దాడి జరిగింది' అని ఐ వెరిఫై వ్యవస్థాపకుడు రాకీ కోల్ చెప్పారు. 'ప్రభుత్వ ప్రేరేపిత వ్యక్తులు మీ ఐఫోన్లను లక్ష్యంగా చేసుకోవచ్చు' అంటూ గత నెల యాపిల్ హెచ్చరికలు అందుకున్న పాత్రికేయుల్లో మంగ్నాలే కూడా ఉన్నారు.