
ప్రజాశక్తి- ఉదయగిరి నెల్లూరు జిల్లా : ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థులలో తూర్పు చెన్నంపల్లికి చెందిన తోటి విద్యార్థి అయిన బక్కఆదయ్య కరెంట్ షాక్ తగిలి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో .. తోటి విద్యార్థులందరూ కలిసి 35 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆదయ్యకు అందజేశారు. వైసిపి యువజన ప్రధాన కార్యదర్శి కల్లూరి రాజారెడ్డి, మహేష్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తక్షణ ఆర్థిక సహాయం పై కుటుంబ సభ్యులు గ్రామస్తులు మిత్ర బృందంవారికి అభినందనలు తెలిపారు.