
ప్రజాశక్తి-పత్తికొండ (కర్నూలు) : పత్తికొండ గ్రామపంచాయతీ 19 వ వార్డు మెంబర్ లక్ష్మి కుమారుడు సిద్దకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. సమాచారం తెలుసుకున్న పత్తికొండ మాజీ మండల అధ్యక్షరాలు ఎస్.నాగరత్నమ్మ శనివారం ఉదయం సిద్ది ఇంటికి వెళ్లి పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వార్డు మెంబర్ లక్ష్మీ మాట్లాడుతూ ... తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన నాగరత్నమ్మకు రుణపడి ఉంటామని అన్నారు.