రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు) : ఏ.ఎస్.ఆర్. రంపచోడవరం జిల్లా వి.ఆర్ పురం మండలం శ్రీరామగిరి పంచాయతీ కల్తునూరు గ్రామవాసులు వరదలో చిక్కుకొని అంధకారంలో మగ్గుతున్నారు. ఆ వరద ప్రాంత ప్రజల కోసం బుధవారం ఉదయం సిపిఎం నేతలు, గిరిజన సంఘం నేతలు తరలివెళ్లారు. నిత్యావసర సరుకులు... మంచినూనె, పాలు, కొవ్వొత్తులను తీసుకెళ్లి వరద బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి, శ్రీరామగిరి సర్పంచ్ పులి.సంతోష్ కుమార్, సిపిఎం నాయకులు గుండిపూడి.లక్ష్మణ్ రావు, పులి.ధర్మరాజు, ఆత్మకూరి.కాంతారావు, నాళ్లారపు.చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.