ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ (బాపట్ల) : నేడు మహాశివరాత్రి సందర్భంగా ... ఇంకొల్లు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇంకొల్లు శివాలయంలో వాసవిక్లబ్ వారితో, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్విరామంగా ప్రసాద పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు చిన్నిపూర్ణారావు , సెక్రటరీ దోగిపర్తి బదరీ నారాయణ, బైసాని నరసింహం శెట్టి, దోగిపర్తి అయ్యప్ప, దోగిపర్తి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నట్లు చిన్ని పూర్ణారావు ఈ సందర్భంగా తెలియజేశారు.










