Nov 13,2023 08:52

శ్రీశైలం ఆలయం : కార్తీక మాసం వేళ ... పుణ్యక్షేత్రాలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రేపటి నుండి మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్‌ 12 వరకు కొనసాగనున్నాయి. రద్దీ రోజుల్లో శ్రీ మల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. శని, ఆది, సోమవారాలతో పాటు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందాలని సూచించారు. భక్తుల రద్దీ ఉండనున్న నేపథ్యంలో ... అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.