- దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే సిఎం కెసిఆర్ పని అని, కెసిఆర్ కుటుంబం అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. శనివారం హన్మకొండ జిల్లాలో పర్యటించిన మోడీ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు, రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయరహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయరహదారి పనులకుశంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి కోసం పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని, కానీ అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు కలిసి పనిచేయడం తొలిసారిగా చూస్తున్నానన్నారు. కెసిఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయని చెప్పారు. కెసిఆర్‌కు కేవలం నాలుగు పనులే తెలుసనాురు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీని తిట్టడం, కుటుంబ పార్టీని పెంచి పోషించడం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేయడమనివిమర్శించారు. టిఎస్‌పిఎస్‌సి కుంభకోణంతో నిరుద్యోగుల ఆశలను వమ్ము చేశారనాురు. ఇలాంటివి చూసేందుకేనా యువత బలిదానాలు చేసింది? అంటూ ప్రశిుంచారు. అవినీతిపై దృష్టి సారించకుండా ప్రజల దృష్టిని కెసిఆర్ మళ్లిస్తునాురని విమర్శించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమైందనాురు. ప్రపంచ దేశాలకు హైదరాబాద్‌లోనే వ్యాక్సిన్ రూపొందించి అందించడం జరిగిందనాురు. కేంద్ర ప్రభుత్వం ఎనోు పథకాలను అమలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశిుంచారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామని వివరించారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజరు, పలువురు ప్రజా ప్రతినిధులు సభలో పాల్గనాురు.