Jul 15,2023 12:00

శ్రీకాళహస్తి : సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్‌ తేజ్‌ హారతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవ్వడంతో.. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమనిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులివ్వాలని.. సినీ హీరో ఎలా ఇస్తాడంటూ.. తేజ్‌ మీద మండిపడుతున్నారు. అయితే అర్చకులు లేకపోవడంతో స్వయంగా హారతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.