
- మెగా రక్తదాన కార్యక్రమంలో వైసిపి నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డి
ప్రజాశక్తి-హిందూపురం(సత్యసాయిజిల్లా) : నేటి యువత రక్తదానంపై పూర్తి అవగాహన పెంచుకుని.. రక్తదానం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలని వైసిపి నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డి అన్నారు. ప్రజాశక్తి 43వ వార్సికోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం పట్టణంలోని ఎన్‌డిజిఎన్ డిగ్రి, ఎంబిఎ కళాశాలలో ప్రజాశక్తి హిందూపురం విలేకరి షబ్బీర్ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అథిధులుగా వైసిపి నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ప్రజాశక్తి ఎడిసన్ మేనేజర్ వేణుగోపాల్, కళాశాల అధ్యక్షులు రేవురి చంద్రమోహన్, క ళాశాల కరెస్పాండెండట్, సెక్రెటరీ బైసాని రాంప్రసాద్, టిప్పుసుల్తాన్ రక్తదాన జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్‌లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేణు రెడ్డి మాట్లాడుతూ.. రక్తదానం చేయడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి అవసరం ఉందన్నారు. నేడు ఎన్నో ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు సంబవించి, సకాలంలో రక్తం అందక ఎన్నో నిండు ప్రాణాలు పోతున్నాయన్నారు. ఒక వ్యక్తి రక్తం ఇవ్వడం వల్ల నలుగుకి ప్రాణదానం చేయడానికి అవకాశం ఉందన్నారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగదని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాశక్తి వారు ఎంతో భాధ్యత తీసుకుని రక్తదానంపై అవగాహన పెంచుతు, మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సే వా కార్యక్రమాలతో పాటు ప్రతి అక్షరం...ప్రజల పక్షం అనే నినాదంతో ముందుకు వచ్చిన ప్రజాశక్తి ఎక్కడ రాజీ పడకుండా ఎన్నో ప్రజాసమస్యలను వెలుగోలి తీసుకు రావాడం చాల సంతోషంగా ఉందన్నారు. ప్రజాశక్తి ఎడిసన్ మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రజాశక్తి పత్రిక విశిష్టత గురించి వివరించారు. అదే విధంగా కరోన విపత్కర సమయంలో చేసిన సేవలు, ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. బైసాని రాంప్రసాద్ మాట్లాడుతూ.. నేడు ఎన్నో పత్రికలు ఉన్నాయి. అయితే ఎవరు చేపట్టని ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రజాశక్తి వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. మెగా రక్తదాన కార్యక్రమాన్ని తమ క శాశాలలో ఏర్పాటు చేయడం చాల సంతోషంగా ఉందన్నారు. టిప్పుసుల్తాన్ రక్తదాన జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతు ఒక వ్యక్తి తన జీవితకాలంలో 135 సార్లు తన రక్తాన్ని దానం చేయ డానికి సాధ్యం ఉందన్నారు. రక్తదానం చేయడం వల్ల 80 శాతం గుండె పోటు రాదన్నారు. దీంతో పాటు 14 రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి తప్పకుండా రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో కళాశాల విద్యార్థులతో పాటు కళాశాల కళాశాల కరెస్పాండెంట్, సెక్రటరీ బైసాని రాంప్రసాద్, అధ్యాపకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జెఎన్ విఎస్ ప్రసాద్, ఎంబిఎ ప్రిన్సిపల్ నాగేంద్ర కుమార్, ప్రజాశక్తి ఎడిసన్ బాధ్యులు మురళి, కళాశాల ఎన్ సిసి ఆఫీసర్ ఫణింద్ర, ఎన్ ఎస్ ఎస్ అ ధికారి రాజన్న, పిడి హేమంత్, బ్లడ్ బ్యాంక్ టెక్నిషియన్‌లు సోము, చిట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.


