Feb 01,2023 13:46

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా చీరాల ఆర్టీసీ ఇంఛార్జి డిపో మేనేజర్‌ అజిత కుమారి అధ్యక్షతన రోటరీ క్లబ్‌ ఆఫ్‌ క్షీరపురి చీరాల, ఆపద్బంధువు బ్లడ్‌ బ్యాంక్‌వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అజిత కుమారి మాట్లాడుతూ ... ప్రతి సంవత్సరం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, ఆపదలో ఉన్నవారికి రక్తం అందించే కార్యక్రమం చేస్తున్నామని, ఈ రక్త దాన శిబిరానికి సహకరించిన రోటరీ క్లబ్‌ క్షీరపూరి చీరాలవారికి, ఆపద్బంధు బ్లడ్‌ బ్యాంక్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో ఆర్టీసీ ఎంప్లాయిస్‌ భారతి డిగ్రీ కాలేజ్‌ విద్యార్థులు పాల్గొని నలభై ఆరు మంది రక్త దానం చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్టీసీ డిపో ఇన్చార్జి డీఎం అజిత కుమారి, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కళ్యాణి, ట్రాఫిక్‌ ఇంచార్జ్‌ పివి.రావు, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ క్షీరపురి చీరాల ప్రెసిడెంట్‌ నన్నపనేని రామకృష్ణ, డాక్టర్‌ రవితేజ, డాక్టర్‌ విజయకుమార్‌, డాక్టర్‌ తాడివలస దేవరాజు, రావి వెంకటరమణారావు, ఆపద్బంధు బ్లడ్‌ బ్యాంక్‌ ఎండి సంతోష్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సందీప్‌, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.