
ములగాడ : పివిఎస్ హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్టు ఐదో వార్షికోత్సవం సందర్భంగా గొల్లలపాలెం వాకర్స్ పార్క్ వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ ఎంవివి.సత్యనారాయణ ప్రారంభించారు. రోటరీ బ్లడ్ బ్యాంక్, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, సంజీవి బ్లడ్ బ్యాంక్, ఫస్ట్ బ్లడ్ బ్యాంక్, ఐకాన్ కృషి బ్లడ్ బ్యాంక్‌ల సహకారంతో నిర్వహించిన శిబిరంలో 888 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మనిషి ప్రాణానికి రక్తం ఎంతో విలువైనదన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన పివి.సురేష్‌ను అభినందించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ మెమోంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, చింతలపూడి. వెంకతరామయ్య, తిప్పల.గురుమూర్తిరెడ్డి, వైసిపి నాయకులు బెహారా భాస్కరరావు, తిప్పల వంశీరెడ్డి, తిప్పల.దేవన్ రెడ్డి, భద్రీనాథ్, దాడి సత్యనారాయణ పాల్గొన్నారు.