నా పేరు తులసి. నేను 4వ తరగతి చదువుతున్నా. అక్షరాలు గుండ్రంగా రాయడం నాకు చాలా ఇష్టం. ఈ సెలవుల్లో రైటింగ్‌ని బాగా ప్రాక్టీస్ చేశా. పై క్లాసులకు వెళుతున్నా కదా అని చేతిరాతపై శ్రద్ధ పెట్టా. ముగ్గులు వేయడం కూడా నేర్చుకుంటున్నా. మా తాత కూడా చెబుతుంటాడు 'చేతిరాత తలరాతను' మారుస్తుందని. మా పాఠశాల్లోని ఉపాధ్యాయులు నా చేతి రాతకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. వాటిని తప్పక పాటిస్తుంటా. మా సార్ చెప్పినట్లు - ముందుగా నాలుగు గీతల పుస్తకంలో ప్రాక్టీస్ చేశా. తరువాత రెండు గీతలు, చివరిగా ఒక గీత పైన చివరగా తెల్లకాగితాలపై రాశా. గుండ్రంగా రాయాలని ఆరాటపడ్డా. ప్రస్తుతం నేను రెండు గీతల మధ్య రాయగలుగుతున్నా. ఆ నమ్మకంతో ఆన్లైన్‌లో జరిగిన హాండ్ రైటింగ్ పోటీల్లో పాల్గొన్నా. నాకు పతకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రోత్సాహంతో మరింత బాగా రాస్తా. అందుకు ఈ వేసవి సెలవులు చక్కగా వాడుకుంటున్నా. మా మండల విద్యాధికారి, మా పాఠశాల ఉపాధ్యాయ బృందం నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.
- తులసి,
4వ తరగతి,
ఎంపిపి పాఠశాల,
మర్తాడు మెయిన్, గార్లదిన్న,
అనంతపురం.










