Mar 07,2023 20:36
  • రూ.4,071 కోట్లకు ఆమోదం

న్యూఢిల్లీ : దేశంలో రెండు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ రంగంలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ రూ.4,071 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దీనికి సోమవారం పవర్‌ గ్రిడ్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోదం తెలిపారని ఆ కంపెనీ బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపారు. కర్నూల్‌ విండ్‌ ఎనర్జీ జోన్‌ / సోలార్‌ ఎనర్జీ జోన్‌ (ఎపి) పార్ట్‌ ఎ, పార్ట్‌ బి కోసం రూ.3,546.94 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపింది. 2024 నవంబర్‌ ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని వెల్లడించింది. అదే విధంగా ఈస్టర్న్‌ రీజియన్‌ విస్తరణ స్కీమ్‌కు రూ.524.04 కోట్ల వ్యయం చేయనున్నాట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు నవంబర్‌ 2025 నాటికి అందుబాటులోకి రానుందని పేర్కొంది.