Apr 21,2023 11:38

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : కర్నూల్‌ నగరం ఒకటవ వార్డులోని చిదంబరావు స్ట్రీట్‌ లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయకపోవడంతో శుక్రవారం విద్యుత్‌ శాఖ అధికారులు కార్పొరేటర్‌ సమక్షంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కార్పొరేటర్‌ షావలి మాట్లాడుతూ ... నగరంలో, 1వ వార్డు, చిదంబరరావు వీధిలో సెంట్రల్‌ లైబ్రరీ సమీపంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని , అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని విషయం తెలుసుకున్నామన్నారు. వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులతో చర్చించి చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి మరొకటిని ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించామన్నారు. స్థానిక వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.