Jun 30,2023 13:24

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో మంగళగిరి ఘాట్‌ రోడ్‌ కరెంట్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన కరెంటు చార్జీలను పెంచి విద్యుత్‌ వినియోగదారులపై భారాలు మోపుతుందని విమర్శించారు. ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను తగ్గించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ స్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు జే వి రాఘవులు, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, సిపిఎం నాయకులు వివి జవహర్లాల్‌, బాలాజీ, జె శివ బావున్నారాయన, కే నాగేశ్వరావు, ఎస్‌ గణేష్‌, జై మహాలక్ష్మి, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌ బాబు, పి నాగేశ్వరావు, ఏ ప్రభాకర్‌, కే ఈశ్వరరావు, బి మోహన్‌ రావు, షేక్‌ జానీ, సిన్ని సత్యనారాయణ పాల్గొన్నారు.