- వారంలో ఇస్తామంటే డిపాజిట్ చేసిన జెన్‌కో
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : తీసుకున్న డిపాజిట్లను తిరిగి చెల్లిరచడంలో ఎపి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విఫలమవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు ఇచ్చినందుకు, ఆ నిధులు సజావుగా తిరిగి రాక ఇరధనశాఖ అల్లాడిపోతోరది. చివరకు వడ్డీ కూడా రాకపోవడంతో జెన్‌కో అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. వారంలో తిరిగిస్తామంటూ తీసుకున్న రూ.వంద కోట్లు, జెన్‌కో గ్రాట్యుటీ ట్రస్ట్ నురచి తీసుకున్న రూ.723 కోట్లు మొత్తం ఇరకా రావడం లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా లేఖలు రాసినట్లు ఒక సీనియర్ అధికారి చెప్పారు. గతేడాది నవంబరులో ఎపి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు జెన్‌కో రూ.వంద కోట్లను డిపాజిట్‌గా ఇచ్చిరది. ఈ నిధులను పిడి ఖాతాలోకి కూడా జమ చేశారు. ఈ మొత్తాన్ని వారం రోజుల్లో ఇస్తామని పిఎఫ్‌సి మురదుగా స్పష్టం చేసిరది. అయితే ఇప్పటివరకు ఆ నిధులు ఇవ్వలేదని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు వస్తే ఎన్‌టిటిపిసి స్టేజ్-5 పనులకు ఖర్చు చేయాల్సి ఉరటురదని వారంటున్నారు. ఈ మొత్తంపై ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్లు వడ్డీ కూడా రావాల్సి ఉరదని చెబుతున్నారు. వడ్డీల భారం పెరిగినా కూడా తారిఫ్‌లో మార్పులు చేసేరదుకు విద్యుత్ నియంత్రణ మండలి అరగీకరిరచడం లేదని జెన్‌కో అధికారులు వాపోతున్నారు.
రాష్ట్ర విభజన జరగడానికి మురదు 2012లోనే రూ.1,787 కోట్ల బారడ్లను 9.57 శాతం వడ్డీతో ఎపిపిఎఫ్‌సి విడుదల చేసిరది. ఈ నిధులు పింఛను, గ్రాట్యుటీ ట్రస్టుకు సంబంధిరచినవి. విభజన అనంతరం ఈ మొత్తంలో రూ.723 కోట్లు రాష్ట్ర వాటాగా మిగిలిపోయాయి. దీనిపై వడ్డీని ఖచ్చితంగా పిఎఫ్‌సి చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గతేడాది సెప్టెరబరు నురచి వడ్డీగా రావాల్సిన రూ.52 కోట్లు ఇరకా రాలేదని, తెలంగాణ వాటాగా ఉన్న రూ.1,064 కోట్లలో కూడా బకాయిలు ఉన్నాయని అధికారులు అరటున్నారు. ఈ బకాయిల వల్ల సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లిరచాల్సిన గ్రాట్యుటీ, ఇతర ఉద్యోగ విరమణ అనంతర ప్రయోజనాల చెల్లిరపులకు ఇబ్బరదులు కలుగుతున్నట్లు జెన్‌కో అధికారులు చెబుతున్నారు.










