Feb 18,2023 21:15

హైదరాబాద్‌ : ప్రముఖ విద్యుత్‌ ఉత్పత్తుల కంపెనీ పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ (పిఐఎల్‌) ఈ ఏడాది జరుగనున్న ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) మ్యాచ్‌లకు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐసిసి పురుషుల, మహిళల అంతర్జాతీయ ఈవెంట్లకు స్పాన్సర్‌గా కొనసాగనున్నట్లు పేర్కొంది. 2023 సంవత్సరాంతం వరకూ ఈ ఒప్పందం నిలిచి ఉంటుందని వెల్లడించింది. దీంతో దక్షిణాఫ్రికాలో జరుగనున్న ఐసిసి ఉమెన్స్‌ టి20 వరల్డ్‌ కప్‌, బ్రిటన్‌లో జరుగనున్న ఐసిసి వరల్డ్‌ టెస్ట్‌ చాంఫియన్‌షిప్‌ ఫైనల్‌కు, భారత్‌లో జరుగనున్న ఐసిసి పురుషుల వరల్డ్‌ కప్‌ 2023 భాగస్వామిగా కొనసాగనున్నట్లు పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ నిలేష్‌ మలానీ పేర్కొన్నారు. ''పాలీక్యాబ్‌కు ఇది అత్యంత సంతోషకర అంశం. దేశీయంగా అభివృద్థి చెందిన పాలీక్యాబ్‌ ఇప్పుడు 60కు పైగా దేశాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ భాగస్వామ్యంతో మా అభిమానులకు మరుపురాని అనుభవాలను అందించనున్నాము'' అని నిలేస్‌ తెలిపారు.