May 15,2023 07:46

ఈ నెల 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు కవితల పోటీ నిర్వహిస్తోంది. వైద్య రంగంలో నర్సుల పాత్ర, వారు అందించే సేవలపై 24 లైన్లకు మించకుండా వచన/ పద్య/ గేయ కవితల్ని రాసి వాట్సాప్‌లో టైప్‌ చేసి 9493686165 ఫోన్‌ నెంబరుకి పంపవలసిందిగా అమరావతి సాహితి మిత్రులు సాహితి సంస్థ అధ్యక్ష, సమన్వయ కర్తలు డాక్టరు రావి రంగారావు, పింగళి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మే 15వ తేదీ వరకు కవితలు పంపవచ్చు. ఉత్తమ కవితకు వెయ్యి రూపాయల నగదు బహుమతి. మే 21న మూడవ ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేటలో జరిగే అమరావతి సాహితీ మిత్రుల సభలో ఫలితాలు ప్రకటిస్తారు. ఉత్తమమైన కవితకు బహుమతి ప్రదానం, కవితల పఠనం కూడా ఉంటుంది.