వివిధ రంగాల్లో కషి చేస్తున్న వసుంధర విజ్ఞాన వికాస సమితి ఈ ఏడాది కూడా పాఠశాల విద్యార్థులకు కర్క ముత్తారెడ్డి స్మారక కవితల పోటీ నిర్వహిస్తోంది. 'అక్షరమే ఊపిరి' అనే అంశం మీద విద్యార్థులు 25 లైన్లకు మించని కవితను పోటీకి పంపాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పదవ తరగతి లోపు విద్యార్థులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలి. ప్రధానోపాధ్యాయులు దృవీకరించిన పత్రంతో పాటు కవిత తమ సొంతమనే హమీ పత్రం తప్పనిసరి. ఒకరు ఒక కవిత మాత్రమే పంపాలి. ఐదు ఉత్తమ కవితలను ఎంపిక చేసి సమాన బహుమతులు అందజేస్తాం. కవితలు చేరాల్సిన చివరి తేది : డిసెంబర్ 15, 2022. చిరునామా : వి.సుమలత, 8096677409, ఇ.నెం-13-1-3/3/6/2, అవంతినగర్ తోట, మోతినగర్, హైదరాబాద్-500018.
- వి.మధుకర్ రెడ్డి










