Dec 17,2022 12:04

ప్రజాశక్తి - చాపాడు (విజయవాడ) : విజయవాడలో ఈ నెల 23, 24 తేదీలలో జరగబోయే 5 వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకు ప్రతినిధిగా కవి పెరుగు ఓబులేసుకు ఆహ్వానము అందినట్లు ఆయన తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ జాతీయవాద కవి, రచయిత భారతీయ హృదయభాష్యము శతక కర్త సామాజిక సమరసత కోసం నిరంతరమూ పాటుపడుతున్న సామాజిక కార్యకర్త, గుంత చియ్యపాడు గ్రామ వాసియైన కవిశ్రీ పెరుగు ఓబులేసు (భవాని)ని నియమించి ఆహ్వానించారు. శనివారం కవి ఓబులేసు ప్రజాశక్తితో మాట్లాడుతూ ... ఈ మహాసభలలో తెలుగు భాషా పరిరక్షణకు చేయవలసిన కృషి, కార్యక్రమాల గురించి నిర్ణయాలు చేస్తారని తెలిపారు. ఇందులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక సంస్థలు, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని, ఈ సభలకు ప్రతినిధిగా వెళ్లి తెలుగు అభివృద్ధికి కృషి చేస్తామని ఓబులేసు పేర్కొన్నారు.