May 12,2023 21:15

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు పోకో తన కీలకమైన ఎఫ్‌-సిరీస్‌లో సరికొత్త పోకో ఎఫ్‌5 5జిని ఆవిష్కరించినట్లు ప్రకటించింది. స్పాప్‌డ్రాగన్‌ 7ఫ్లస్‌ జెన్‌2తో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. 64 ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి, 2ఎంపి మైక్రో కెమెరాలతో సహా సెల్ఫీ కోసం 16ఎంపి కెమెరాను అమర్చినట్లు తెలిపింది. 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీతో కూడిన 8జిబి, 256 జిబి వేరియంట్‌ ధరను రూ.29,999గా, 12జిబి, 256 జిబి వేరియంట్‌ ధరను రూ.33,999గా నిర్ణయించింది. మే 16 నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతుందని తెలిపింది.