Apr 21,2023 21:30

బెంగళూరు : ఇండియన్‌ ప్లంబింగ్‌ అసోసియేషన్‌ (ఐపిఎ) ఏప్రిల్‌ 27 నుంచి 29వ తేది వరకు బెంగళూరులో అతిపెద్ద నీరు, పారిశుద్ధ్యం, ప్లంబింగ్‌కు సంబంధించి ప్లంబెక్స్‌ ఇండియా 2023 ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక్కడ నీరు, పారిశుద్ధ్య, ప్లంబింగ్‌ ఉత్పత్తులలో తాజా ఆవిష్కరణలు, వినూత్నమైన పరిష్కారాలు, ఆ రంగం ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు పేర్కొంది. దాదాపు 10వేల మంది వ్యాపార, వాణిజ్య సందర్శకులు హాజరు కావొచ్చని ఐపిఎ తెలిపింది.