మాస్కో: రష్యాలో జరిగిన ఒక ప్రైవేటు విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌తో సహా 10 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 'మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ ఎంబ్రేయర్ లెగసీ విమానం ట్వెర్ ప్రాంతంలోని కుజెంకినో గ్రామ సమీపంలో కూలిపోయింది. విమానంలో ముగ్గురు సిబ్బందితో సహా 10 మంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఉన్నవారంతా మరణించారు' అని ప్రకటన తెలిపింది. ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిస్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని గంటల్లో ఈ తిరుగుబాటు ముగిసింది.