మాస్కో : దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెసాపై రష్యా వైమానిక దాడి జరిపినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఈ దాడిలో ఓ మహిళ గాయపడిందని అన్నారు. ఆదివారం అర్థరాత్రి సమయంలో రష్యా క్షిపణి మరియు డ్రోన్‌లతో దాడి చేసిందని ఒడెసా గవర్నర్ ఒలెహ్ కిపర్ సోమవారం తెలిపారు. దీంతో ఓడరేవులో ప్రాంతంలో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, అలాగే ఒడెసాలోని నివాసేతర భవనంలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.