Feb 15,2023 20:45

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో పిట్టీ ఇంజనీరింగ్‌ నికర లాభాలు 5 శాతం పెరిగి రూ.12.13 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.60 కోట్ల లాభాలు నమోదు చేసినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో రూ.265 కోట్లుగా ఉన్న రెవన్యూ.. క్రితం క్యూ3లో 10 శాతం తగ్గి రూ.239 కోట్లుగా చోటు చేసుకుంది. కాగా ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.1.50 డివిడెండ్‌ను ప్రతిపాదిస్తూ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.