Aug 09,2023 15:58

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : జాతీయ జెండా రూపకర్త పింగళ్లి వెంకయ్య జయంతి సందర్భంగా సాహితీ చైతన్య కిరణాలు వాట్సప్‌ సమూహం నిర్వహించిన జాతీయస్థాయి వచన కవితల పోటీలలో పట్టణానికి చెందిన చెందిన కవి, రచయిత, వృత్తి రీత్యా గుంటూరు-2 డిపోలో కండక్టర్‌ అయిన ఆళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన 'జెండా రూపశిల్పి పింగళి' అనే కవితకు పింగళి స్మారక సాహితి పురస్కారాన్ని ఆన్లైన్‌ ద్వారా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బోగిల ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పి.ఆర్‌.యస్‌.యస్‌.యన్‌మూర్తి అందించినట్లు ఆళ్ల తెలిపారు. సంస్థ పంపిన ధృవీకరణ పత్రాన్ని బుధవారం అందుకున్న ఆళ్లను పలువురు సాహితీ ప్రియులు అభినందించారు.