Oct 07,2023 13:57

ఇంటర్నెట్‌డెస్క్‌ : టాటా గ్రూప్‌ ఎయిర్‌ఇండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్‌ ఇండియా అభివృద్ధిలో భాగంగా.. విమానాల డిజైన్‌ను టాటా గ్రూప్‌ మార్చింది. ట్రెండ్‌కి తగ్గట్టుగా సరికొత్తగా లోగోను మార్చింది. తాజాగా ఎరుపు- వంకాయ రంగు, గోల్డ్‌ కలర్‌ పెయింటింగ్‌తో వేసిన ఎ350 విమానం ఫొటోను టాటా గ్రూప్‌ షేర్‌ చేసింది. ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని వర్క్‌షాప్‌లో కొత్త లోగోతో ఉన్న కొత్త ఎ350 విమానం అని.. ఈ ఎ350 విమానాలన్నీ శీతాకాలంలో భారత్‌కు వస్తాయని ఎయిర్‌ఇండియా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విమానాల సరికొత్త మార్పుల కోసం టాటా గ్రూప్‌ 400 మిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది.