న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు విమానాలను పరిమితం చేశాయి. . భారత్ నుంచి అక్కడికి రాకపోకలు సాగించే విమానాలను వారంపాటు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఆదివారం ప్రకటించింది. 'ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా.. టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేస్తున్నాం' అని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్ అయిన ప్రయాణికులకు అన్ని రకాల సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. శనివారం కూడా టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసిన సంగతి తెలిసిందే. జర్మన్ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సాతో సహా పలు సంస్థలు విమానాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లుఫ్తాన్స్, స్విస్ ఎయిర్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.