న్యూఢిల్లీ : దీపావళి పండుగ సీజన్ సందర్బంగా 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది. తమ యాప్ ద్వారా రూ.1000 విలువ పైబడిన డిజిటల్ బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు రూ.3000 వరకు గ్యారంటీ క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 9-12 మధ్య అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వినియోగదారలు ఏ సమయంలో అయినా తమ బంగారాన్ని విక్రయించుకోవచ్చు. ఆ విక్రయం ద్వారా అందే సొమ్ము 48 గంటల్లో వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడుతుందని పేర్కొంది.