
హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో 5,089 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తులు.. తదితర వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.