Jul 25,2023 15:52

ప్రజాశక్తి-రేపల్లె (గుంటూరు) : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్‌ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను కోర్టు ఆదేశాలు లేకుండా పేదలకు ఇళ్ళ స్థలాలుగా ఇవ్వడం మోసపురితమన్నారు. కృష్ణాయపాలెంలో ముఖ్యమంత్రి అధ్వర్యంలో నిర్వహించిన గృహనిర్మాణాల శంకుస్థాపన సభలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ పిచ్చిగా మద్యం సేవించి, గంజాయి తీసుకున్న వ్యక్తి వలె పవన్‌ కళ్యాణ్‌పై అతి నీచంగా మాట్లాడారని ఆరోపించారు. ప్రభుత్వ సభలో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం జోగి రమేష్‌ దిగజారుడు వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు. ప్రజా సమస్యలపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చేతకాని దద్దమ్మలుగా మంత్రి మండలిలో ఉండటం ఆంధ్రుల దౌర్భాగ్యం అన్నారు. బీసీ కార్పోరేషన్‌ ఎస్‌ సి కార్పోరేషన్‌ నిధులు ఇవ్వకుండా మోసం చేసిన నీచమైన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. ఇసుక,మద్యం ద్వారా వేలకోట్ల రూపాయలు అవినీతి చేస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు తన ముఖం కనపడకుండా పరదాలు చాటున తిరుగుతున్నారని ఆరోపించారు. పిచ్చి పిచ్చి గా మాట్లాడే మంత్రులను, చేతకాని పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బత్తుల మల్లి, రాజశేఖర్‌, పరిశా పవన్‌ కళ్యాణ్‌, తోట వెంకట్‌, చందు, కొలగాని రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.