న్యూఢిల్లీ : పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయడంలో జాప్యానికి విధిస్తున్న జరిమానా సరైందేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రూ.1000 జరిమానాతో వీటిని లింక్ చేసుకోవడానికి జూన్ నెలాఖరు వరకు సిబిడిటి గడువును పొడగించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని జరిమానా విధించడంపై తీవ్ర వ్యతరేకత వ్యక్తం అవుతోంది. పాన్‌తో ఆధార్ లింక్‌నకు చాలా సమయం ఇచ్చామన్నారు. ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసుకొని ఉండాల్సిందన్నారు. ఇప్పటి వరకు చేయని వారు ఇకనైనా అనుసంధానం చేసుకోవాలన్నారు. గడువులోగా పాన్-ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్‌కార్డుతో ఎలాంటి లావాదేవీలు చేసేందుకు అవకాశం ఉండదని మంత్రి హెచ్చరించారు. ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడానికి, సరి చేసుకోవడానికి వీలుండదన్నారు.










