ముత్తూట్ ఫిన్‌కార్ప్ యాప్‌తో అవకాశం
న్యూఢిల్లీ : ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ ఇటీవల ఆవిష్కరించిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో ఇంటి నుండి లేదా బ్రాంచ్‌లో బంగారం ఋణాలను పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఇదే తరహాలో ఎంఎస్‌ఎంఇలకు కూడా అప్పులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. తమ యాప్‌లో డిజిటల్ గోల్డ్, ఎన్‌సిడి వంటి పెట్టుబడి ఉత్పత్తులను సైతం అందిస్తున్నట్లు వెల్లడించింది.