Mar 16,2023 21:07

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌ల పరిణామాలతో భారత్‌లో బంగారం ధర పెరిగింది. గురువారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడిపై రూ.380 పెరిగి రూ.57,450కి చేరిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇంతక్రితం సెషన్‌లో ఈ లోహం ధర రూ.57,070 వద్ద ముగిసింది. కిలో వెండిపై రూ.90 తగ్గి రూ.66,535గా పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క ఔన్స్‌ పసిడి ధర 1,922 డాలర్లుగా, వెండి ధర 21.61 డాలర్లుగా నమోదయ్యింది.