- ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు
బుడాపెస్ట్(హంగేరీ): ఛాంపియన్‌షిప్-2023లో మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత మహిళా అథ్లెట్ పారుల్ చౌదరి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పారుల్ 9నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి 11వ స్థానంలో నిలిచింది. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్ అర్హత మార్క్‌ను చేరుకోవడంతో పాటు జాతీయ రికార్డును నెలకొల్పింది. బుధవారం జరిగిన హీట్స్‌లో ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన పారుల్.. ఫైనల్లో 2,900మీటర్ల స్ప్లిట్ వరకు 13వ స్థానంలో ఉంది. చివరి వంద మీటర్ల స్ప్లిట్‌లో రెండు స్థానాలను మెరుగుపరుచుకొని 11వ స్థానంలో నిలిచింది. మరో వైపు పురుషుల 400 మీటర్ల రిలే ఫైనల్లో అనస్ యాహియా, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక పురుషుల 4×400మీ. రిలే జట్టు కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. ఆగస్టు 19న ప్రారంభమైన ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలు 27న జరిగిన పోటీలతో ముగిసాయి.
2023 ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శన..
నీరజ్ చోప్రా జావెలిన్ త్రో స్వర్ణం
కిషోర్ జెనా ,, 5వ స్థానం
డిపి మను ,, 6వ స్థానం
పురుషుల జట్టు 4×400మీ. 5 వస్థానం
జాస్విన్ ,, 11వ స్థానం
పారుల్ చౌదరి 3వేల మీ.స్టీపుల్‌ఛేజ్ 11వ స్థానం(జాతీయ రికార్డు; 9ని.51.31సె.)
క్రిషన్ కుమార్ 800మీ. 7వ స్థానం
అజరుకుమార్ 1500మీ. 13వ స్థానం
సంతోష్ కుమార్ 400మీ.హార్డిల్స్ 7వ స్థానం
అవినాశ్ సేబల్ 3వే.మీ. స్టీపుల్‌ఛేజ్ 7వ స్థానం
ఫైనల్‌కు చేరడంలో విఫలమైన అథ్లెట్లు..
సర్వేష్ హైజంప్
మురళీ శ్రీశంకర్ లాంగ్‌జంప్
షైలీ సింగ్ లాంగ్‌జంప్
ప్రవీణ్ చిత్రవేల్ ట్రిపుల్‌జంప్
అబ్దుల్లా అబుబకర్ ,,
ఎల్డోజ్ పాల్ ,,
రామ్ బాబూ 35కి.మీ. రేస్‌వాక్
ఆకాశ్, వికాస్, బిస్త్ 20కి.మీ. రేస్‌వాక్
జ్యోతి యర్రాజి 100మీ. హర్డిల్స్










