Aug 03,2023 07:04

బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయిలో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, విటమిన్‌ సి, విటమిన్‌ డి తగిన మోతాదులో ఉంటాయని పేర్కొంటున్నారు. బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా... ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విష పదార్థాల్ని తొలగిస్తుంది.
బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడే వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్‌ లెట్స్‌ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా... ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉండే వారికి బొప్పాయి ఔషదం. రెగ్యులర్‌గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టొచ్చు. అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని తొలగిస్తుంది. కాన్సర్‌పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్లను తగ్గిస్తుంది.