Oct 19,2023 15:13

ప్రజాశక్తి - ఆలమూరు(అంబేడ్కర్‌ కోనసీమ) : అవినీతి ఆరోపణల కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు అభియోగాలన్నీ త్వరలోనే తొలగిపోయి బయటికి వస్తారని ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీమురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు వ్యాఖ్యానించారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాజీ ఎమ్మెల్యే బుచ్చియ్య చౌదరి సమక్షంలో విడివిడిగా కలుసుకొని ధైర్యంగా ఉండాలని చెబుతూ ఈ మేరకు సంఘీభావం తెలిపానని ఆయన వివరించారు.