Oct 20,2023 09:24

కొచ్చి : పాలస్తీనా దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సాలస్తీనీయులను నిర్మూలించే దిశగా దాడులు సాగుతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు.. కొచ్చిలో జరిగిన పాలస్తీనా సంఘీభావ సదస్సును గురువారం నాడిక్కడ ఆయన ప్రారంభించారు. గాజా ఆసుపత్రిపై దాడి అత్యంత దుర్మార్గమైనదని ఏచూరి ఖండించారు. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్‌ తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతోందన్నారు. ఆస్పత్రిపై క్షిపణి దాడి చేసింది తాము కాదని, హమాస్‌ డిఫెన్సివ్‌ క్షిపణుల వల్ల ఆసుపత్రి ధ్వంసమైందంటూ ఇజ్రాయిల్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇలాంటి బోగస్‌ వార్తల వెనుక ఆంతర్యాన్ని గుర్తించాలని ఆయన కోరారు.