May 29,2023 08:11

అరిశా సత్యనారాయణ - ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకాల స్ఫూర్తితో పాలపిట్ట నిర్వహించిన కథల పోటీకి మూడు వందలకు పైగా కథలు వచ్చాయి. ఇది తెలుగునాట కథారచన విస్తృతిని తెలియజేస్తోంది. కథావస్తువులో వైవిధ్యం అపారంగా ఉంది. పలు దఫాలుగా చదివిన తరువాత కథల ఎంపిక జరిగింది. మొదటి బహుమతి: గీతలు చెడిపి... - శాంతినారాయణ; రెండో బహుమతి: తోడు - టి.వి.ఎల్‌. గాయత్రి; మూడో బహుమతి : ఈతరం కథ - కోటమర్తి రాధా హిమబిందు. ప్రత్యేక బహుమతులు : 1. సీతపిన్ని - కపాకర్‌ పోతుల, 2. మౌనం రాగమైన వేళ! - నాదెళ్ల అనురాధ, 3. పగటి చూపు - జడా సుబ్బారావు, 4. తోడేళ్ళు - సాగర్ల సత్తయ్య, 5. మంచితనం - గన్నవరపు నరసింహమూర్తి పొందారు.

- గుడిపాటి, ఎడిటర్‌, పాలపిట్ట