
మహబూబ్‌నగర్ : తెలంగాణ సాగునీటి రంగంలో మరోఘట్టం ఆవిష్కఅతమైంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద చేపట్టిన మొదటి పంపు డ్రైరన్ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటర్ డ్రైరన్‌ను ఇంజినీర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ రావు దగ్గరుండి పర్యవేక్షించారు.
కాగా, త్వరలోనే వెట్‌రన్ చేసేందుకు యంత్రాంగా సిద్ధమవుతున్నది. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి, సీఈ హమీద్ ఖాన్, మేఘా కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.